శ్రీ చైతన్య (కార్పొరేట్) పాఠశాలతో కుమ్మకైనా DEO పైన చర్యలు తీసుకోవాలి- ఏబీవీపీ జగిత్యాల
అఖిల భారతీయ విద్యార్ధి పరిషత్ జగిత్యాల శాఖ ఆధ్వర్యంలో శ్రీ చైతన్య పాఠశాల అక్రమంగా పుస్తకాలు అమ్మడాన్ని నిరసిస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది..
ఈ సందర్బంగా రాష్ట్ర కార్యసమితి సభ్యుడు రాపాక సాయికుమార్ మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్దంగా శ్రీ చైతన్య కార్పొరేట్ పాఠశాల నడుస్తుందని, తోక పేరుతో పాఠశాల నడుపుతున్న, అక్రమంగా ఫైర్ NOC తీసుకున్నారని, గ్రౌండ్, పార్కింగ్ స్థలం లేకుపోయిన, DEO పట్టించుకోవడం లేదని, విద్యార్థుల వద్ద నుండి అధిక ఫీజులు వసూలు చేస్తూ పేద వారిని ఇబ్బంది పెడుతుందన్నారు ప్రభుత్వ నిబందనలను ఉల్లంగించి పాఠశాలల్లో పుస్తకాలు అమ్ముతున్నారు అని మండిపడ్డారు...ఈ పాఠశాల పైన చర్యలు తీసుకోవాలని ఎన్ని సార్లు స్థానిక అధికారులకు చెప్పినప్పటికి స్పందించడం లేదు అని ఎందుకు DEO కి శ్రీ చైతన్య (కార్పొరేట్) పాఠశాల దోపిడీ పైన ఇంత నిర్లక్ష్యం అని ప్రశ్నించారు, ఇప్పటికైనా ప్రభుత్వం మేలుకొని ఫీజుల నియంత్రణ చట్టం తీసుకురావాలని ప్రభుత్వ నిబంధనలు ఉల్లంగించి నడుస్తున పాఠశాలను గుర్తింపు రద్దు చేయాలనీ, శ్రీ చైతన్య పాఠశాలకు కొమ్ముకాస్తున్న DEO ఇప్పటికి అయిన కళ్లు తెరిచి శ్రీ చైతన్య పాఠశాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు లేని యెడల రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు...
ఈ కార్యక్రమంలో:-జిల్లా విస్తరక్ నల్ల నవీన్,జిల్లా హాస్టల్ కన్వీనర్ శ్రీను, మనోహర్,చరణ్, దుర్గ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?