రక్తదాన సంధానకర్త కటుకం గణేష్ కు ఘనసన్మానం

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో శుక్రవారం రోజున తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ కోరుట్ల డివిజన్ ఆధ్వర్యంలో సామాజికవేత్త, రక్తదాన సంధానకర్త కటుకం గణేష్ ను జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ ఘనంగా సన్మానించారు
ఈ సందర్భంగా తెలంగాణ ఆల్ సీనియర్ సిటిజన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు హరి అశోక్ కుమార్ మాట్లాడుతూ:- కోరుట్ల పట్టణంలోనే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా లో రక్తం అవసరం ఉన్నవారికి రక్తం అందిస్తూ, ఎంతోమంది ప్రాణాలను కాపాడిన ప్రాణదాత కటుకం గణేష్ అని ఆయన కొనియాడారు
గతంలో రాష్ట్ర ప్రభుత్వం నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఉత్తమ సేవకుడిగా అవార్డును అందుకున్న గణేష్, ఇప్పటివరకు 4050 మంది రక్తదాతలతో రక్తం ఇప్పించి, ఎంతోమంది అభాగ్యులకు అండగా నిలిచి తానున్నానని మరోసారి నిరూపించుకున్న వ్యక్తి గణేష్ అని, ఇప్పటివరకు జిల్లా వ్యాప్తంగా ఎన్నో అవార్డులు, సన్మానాలను అందుకున్న ఏకైక వ్యక్తి కటుకం గణేష్ అని హరి అశోక్ కుమార్ అన్నారు
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు పిసి హనుమంత రెడ్డి డివిజన్ అధ్యక్షులు పబ్బ శివానందం గంటెడి రాజమోహన్ నల్ల లక్ష్మీనారాయణ రాజయ్య గంగారాం తదితరులు పాల్గొన్నారు
What's Your Reaction?






