మెట్ పల్లి అంబెడ్కర్ స్టేడియం అభివృద్ధికి 50 లక్షల రూపాయలు మంజూరు.

Jan 14, 2023 - 02:46
Jan 14, 2023 - 02:46
 0  675
మెట్ పల్లి అంబెడ్కర్ స్టేడియం అభివృద్ధికి 50 లక్షల రూపాయలు మంజూరు.
మెట్ పల్లి అంబెడ్కర్ స్టేడియం అభివృద్ధికి 50 లక్షల రూపాయలు మంజూరు.

50 లక్షల రూపాయలతో స్టేడియంలో చేపట్టే పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ రావు గారు.

అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ స్టేడియంలో మిగులు పనులను పూర్తిచేసేలా సి ఎస్ ఆర్ నిధుల నుండి 50 లక్షలు తక్షణ మంజూరు చేయడం జరిగిందని ఇవి గాక ఏమైనా పనులు మిగిలిన మరికొంత నిధులు కేటాయించి స్టేడియం పూర్తిస్థాయి పనులు చేస్తామని స్టేడియంలో క్రీడాకారులకు ఏ ఇబ్బంది కలగకుండా పూర్తిస్థాయి పనులు చేస్తానని నియోజకవర్గంలోని మించి గుర్తించి తెచ్చేలా స్టేడియాన్ని పూర్తి చేస్తానని అన్నారు ,

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బోయినపల్లి చంద్రశేఖర రావు ఎంపీపీ మారు సాయిరెడ్డి కౌన్సిలర్ ధ్యానపెల్లి వరలక్ష్మి రాజారాం, మన్నే ఖాన్, కోఆప్షన్ మార్గం గంగాధర్, బర్ల సాయన్న జావిద్ , ఓజెల శ్రీనివాస్, లింగంపల్లి సంజీవ్ ,అరిసెల మురళి ,జక్కం బాబు, సుధాకర్ గౌడ్ .అధికారులు డిఈ గోపాల్, ఏఈ అరుణ్ కుమార్ , నిరంజన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow