మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందించబడుతుంది
తెలంగాణ ప్రభుత్వం మిషన్ భగీరథ పథకం ద్వారా ఇంటింటికి త్రాగునీరు అందించడం జరుగుచున్నదని జగిత్యాల జిల్లా కోరుట్ల శాసన సభ్యులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు. తెలంగాణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలోని వాటర్ ఫిల్టర్ ప్లాంట్ ఆవరణలో తెలంగాణ మంచినీళ్ళ పండుగ కార్యక్రమానికి ఎమ్మేల్యే , జెడ్పీ చైర్ పర్సన్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు త్రాగునీటి అవసరాలకు ఇబ్బందులు ఎదుర్కోవడం జరిగిందని తెలిపారు. ముఖ్యమంత్రి ఆలోచనలు, దూరదృష్టితో ప్రతీ ఇంటికి త్రాగునీరు అందించేందుకు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా ఇంటింటికి నల్లా కనెక్షన్ల ద్వారా ప్రతీ ఒక్కరికీ 100 లీటర్ల శుద్ధమైన త్రాగునీరు సరఫరా చేయడం జరుగుతున్నదని తెలిపారు. 5 మున్సిపాలిటీలకు, 497 ఆవాసాలకు మంచినీటిని సరఫరా చేయడం జరుగుతున్నదని, 1430 కోట్లతో పనులు చేపట్టడం జరిగిందని తెలిపారు. సాంకేతిక సమస్యల వలన సరఫరాలో ఇబ్బందులు ఎదురౌతున్నాయని, సమస్యలు వచ్చినప్పుడు అధికారులకు తెలియజేయాలని అన్నారు. మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న నీటిని ప్రతీ ఒక్కరు తాగాలని పేర్కొన్నారు. జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంత మాట్లాడుతూ, తెలంగాణ రాకముందు నీళ్ళ గోస ఉండేదని, ఆడబిడ్డలు నీటి కోసం రోడ్లు ఎక్క కూడదని, ప్రతీ ఇంటికి నీటి సరఫరా కార్యక్రమం మిషన్ భగీరథ ను అమలుచేయడం జరుగుచున్నదని తెలిపారు. 2015 సంవత్సరంలో ఈ పథకాన్ని ప్రవేశ పెట్టడం ద్వారా మహిళలు సంతోషం వ్యక్తం చేశారని అన్నారు. నాణ్యత ప్రమాణాలతో కూడిన శుద్ధమైన నీటిని సరఫరా చేయడం జరుతున్నదని అన్నారు. ప్రతీ నిత్యం మన ఇంటి ముందు గోదావరి జలాలు వస్తున్నాయని, అపర భగీరదుడు మన ముఖ్యమంత్రి అని అభివర్ణించారు. భావి తరాల వారికి కూడా శుద్ధమైన నీటిని అందించాలని అన్నారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మంద మకరంద్ మాట్లాడుతూ, సాంకేతిక పరిజ్ఞానంతో శుద్ధిచేసిన మిషన్ భగీరథ నీటిని ప్రతీ ఒక్కరు తాగాలని అన్నారు. ఆర్వో , సాధారణ నీటిని వినియోగించడం ద్వారా కలిగే నష్టాలను, మిషన్ భగీరథ నీటి వినియోగం ద్వారా l కలిగే లాభాలను ఆయన వివరించారు. మిషన్ భగీరథ నీరు త్రాగడం అలవాటు చేసుకోవాలని తెలిపారు. ప్రజలకు అవగాహన కల్పించడానికి డబ్బా ప్లాంట్ వద్ద సమావేశం ఏర్పాటుచేయడం జరిగిందని తెలిపారు. తాను శిక్షణలో ఉన్నపుడు మిషన్ భగీరథ నీటి వినియోగంపై ప్రయోగాత్మకంగా పరిశోధించానని తెలిపారు. అంతకుముందు ఫిల్టర్ ప్లాంట్ ప్రాంతాలను సందర్శించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ వినోద్, మునిసిపల్ చైర్మన్ లు, జెడ్పీటీసీ లు, ఎంపిపి, సర్పంచ్ లు, కోరుట్ల, మెట్ పల్లి మునిసిపల్ కమిషనర్లు, స్థానిక ప్రజా ప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
What's Your Reaction?