ఫోన్ పోయిన,చోరికి గురైనా CEIR అప్లికేషన్ సద్వినియోగం
జగిత్యాల జిల్లా పరిధిలో గడిచిన మూడు నెలల్లో పోగొట్టుకున్న, చోరికి గురైన 72 మొబైల్ ఫోన్లను బాధితులకు అందజేత జిల్లా ఎస్పీ
(RNI) సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ గారు అన్నారు. గడిచిన మూడు నెలల్లో ఈ యొక్క అప్లికేషన్ ద్వారా 609 కంప్లైంట్స్ రావడం జరిగింది ఇందులో 178 ఫోన్ లను ట్రేస్ చేసి బ్లాక్ చేయడం జరిగిందిని ఇందులో సుమారు 10 లక్షల విలువగల 72 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని బాధితులకు ఇవ్వడం జరిగిందని అన్నారు. పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని CEIR వెబ్సైట్లో వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. అదే విదంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా IMEI నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని తద్వారా అట్టి ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు. అదేవిధంగా ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు.
What's Your Reaction?