జగిత్యాల జిల్లాలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన
జగిత్యాల జిల్లాలో విద్యార్థులకు సైబర్ నేరాలపై అవగాహన ఈ శిక్షణ అనంతరం విద్యార్థులు తోటి విధ్యార్థులతో పాటు, తమ బందువులకు ఇరుగు పొరుగు వారికి సైబర్ నేరాలపై అవగాహనకల్పించాలి అని కోరారు ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ భాస్కర్ మాట్లాడుతూ.... సైబర్ నేరాలపై అవగాహన కల్పించి చైతన్య పరచడమే సైబర్ కాంగ్రెస్ ప్రధాన లక్ష్యం అందులో బాగంగా విద్యార్థి దశలోనే చిన్నారులకు సైబర్ క్రైంపై అవగాహన కల్పించడంలో భాగంగా ఉమెన్ సెఫ్టీ వింగ్ తెలంగాణ పోలీస్ మరియు స్కూల్ ఎడ్యూకేషన్ డిపార్టుమెంటు ఆద్వర్యంలో జిల్లాలలో 60 ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో నుండి 240 విద్యార్థులకు, 120 ఉపాధ్యాయులకు సైబర్ భద్రత పై శిక్షణ తో పాటు సైబర్ నేరాలపై అవగాహన , నివారణకు శిక్షణ అందజేయడం జరుగుతుంది. ప్రస్తుత కాలంలో వాట్స్అప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ వంటి సోషల్ మీడియా ను పిల్లలు ఎక్కువ వాడుతున్నారు కాబట్టి వాటిని వాడేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తల్లిదండ్రులు పిల్లలకు సూచించాలని అన్నారు..సైబర్ కాంగ్రెస్‌లో నేర్చుకున్న విషయాల్ని అంబాసిడర్లు తోటి విద్యార్థులకు, తల్లిదండ్రులకు, సమాజానికి అవగాహన కల్పించాల్సి ఉంటుందని తెలియజేశారు . ఉపాధ్యాయులు సైతం సైబర్ నేరాల నియంత్రణలో తమవంతు పాత్ర పోషించాల్సి ఉంటుంది అని అన్నారు . ఆన్‌లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులకు మాత్రమే కాదు.. అందరికీ అవగాహన తప్పనిసరి అని ఎస్పీ అన్నారు. ప్రస్తుత రోజుల్లో టెక్నాలజీ పెరుగుతున్న కొద్ది సైబర్ నేరాల సంఖ్య పెరుగుతోందని, ముఖ్యంగా ప్రజలు ఈ సైబర్ నేరగాళ్ల బారిన పడకుండా ముందుస్తూ జాగ్రత్తలు తీసుకోవడం అవసరమని అన్నారు.
What's Your Reaction?