జగిత్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులకు మరియు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు: జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్

Jun 2, 2023 - 15:15
 0  540
జగిత్యాల జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయం లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

జగిత్యాల: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం ను పురస్కరించుకొని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ జాతీయ జండా ను ఆవిష్కరణ చేయడం జరిగింది. అనంతరం  ఎస్పీ జిల్లా ప్రజలకు, పోలీస్ అధికారులు‌ మరియు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. 
శాంతియుత వాతావరణం ఉన్నప్పుడే సమాజ అభివృద్ధి వేగవంతం అవుతుందన్నారు.సంఘ విద్రోహుల పట్ల కఠినంగా ఉంటూ, సాధారణ ప్రజలలో భరోసా కల్పిస్తూ స్నేహపూర్వక పోలీసుగా చేస్తూ ఎలాంటి వివక్ష లేకుండా ప్రజలందరికీ ఒకే రకమైన సేవలు అందిస్తునామని అన్నారు. అధికారులు‌ మరియు  సిబ్బంది క్రమశిక్షణ, డ్యూటీ మైండ్, మరింత బాధ్యతతో పని చేసి  జిల్లా ప్రజలకు మరింత మెరుగైన సేవల ను బాధ్యతతో  అందిస్తూ పోలీసుశాఖకు మంచి పేరు తీసుకరావాలని సూచించారు.
ఈ  కార్యక్రమంలో డీఎస్పీ లు ప్రకాష్, రవీంద్ర కుమార్, RI లు వామనమూర్తి,నవీన్,A.O అమర్నాథ్, ఐటీ ఇన్స్పెక్టర్ సరిలల్,  పొలిసు అధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

What's Your Reaction?

Like Like 0
Dislike Dislike 0
Love Love 0
Funny Funny 0
Angry Angry 0
Sad Sad 0
Wow Wow 0