జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ అధ్వర్యంలో కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు గారి సూచనల మేరకు జువ్వాడి కృష్ణారావు గారి నాయకత్వములో కోరుట్ల కొత్త బస్ స్టాండ్ వద్ద  నిరసన దీక్షను చేపట్టడం జరిగింది

Mar 28, 2023 - 15:45
 0  3.1k

జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ అధ్వర్యంలో కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇంఛార్జి జువ్వాడి నర్సింగరావు గారి సూచనల మేరకు జువ్వాడి కృష్ణారావు గారి నాయకత్వములో కోరుట్ల కొత్త బస్ స్టాండ్ వద్ద  నిరసన దీక్షను చేపట్టడం జరిగింది.. రాహుల్ గాంధీ గారికి మద్దతుగా చేపట్టిన నిరసన దీక్షకు పట్ట భద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు హాజరై సంఘీభావం ప్రకటించడం జరిగింది..ఈ సంధర్బంగా ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ గాంధీ నెహ్రూ కుటుంబాలు దేశం కోసం చేసినా అత్యున్నత త్యాగాలకు వారసత్వం అయినా
రాహుల్ గాంధీ గారిపై కేంద్ర ప్రభుత్వ నిరంకుశ ధోరణిని తీవ్రంగా ఖండించడం జరిగింది.. రాహుల్ గాంధీ మీద జరుగుతున్న దాడి అనేది  ప్రజాస్వామ్యం మీద జరుగుతున్న దాడిగా వర్ణించడం జరిగింది.మొత్తం దేశ సంపదను దోచుకుని ఒకరిద్దరు బడా పారిశ్రామిక వేత్తలకు కట్టబెడుతున్నరని,ప్రభుత్వ రంగ సంస్థలను ఒకదాని తర్వాత ఒకటి అమ్మేస్తున్నారని, ప్రజల సొమ్ము దోపిడీ గురించి రాహుల్ గాంధీ వేస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక భయాందోళనకు గురై ప్రజాస్వామ్యన్ని పాతరెస్తూ  నియంత తరహాలో అణిచివేసే ప్రయత్నమే రాహుల్ గాంధీ ఎంపీ పదవి మీద వేసిన అనర్హత వేటు అని మండిపడ్డారు.బిజేపీ ప్రభుత్వం మరియు కేంద్ర మంత్రివర్గం అంతా కలిసి అదానీ మరియు బీజేపీ మోడీ మధ్యలో గల ఆర్థిక సంబంధాల్ని కాపాడడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ప్రజలు ఆలోచనా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు..బిజేపీ పాలనలో ప్రజాస్వామ్యం స్థాయి పాతాళానికి  చేరిందని మండి పడ్డారు..జువ్వాడి కృష్ణారావు మాట్లాడుతూ  బీజేపీ ప్రభుత్వం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఎంపీ పదవిపై అనర్హత వేటు వేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ,ప్రతి పక్షాల వారిని అణచివేస్తూ విస్తరించే పాసిస్టు పార్టీ బిజేపీ పార్టీ మండి పడ్డారు.,కేంద్ర ప్రభుత్వం అదానీ లాంటి బడా పారిశ్రామిక వేత్తలకు కొమ్ము కాస్తూ ప్రభుత్వం ఉన్నది కార్పొరేట్ల కోసమే అన్నట్లు  మోడీ వ్యవహార శైలి ఉందని అన్నారు.. నీరవ్ మోడీ,లలిత్ మోడీ,నిషాన్ మోడీ,మోహుల్ చొక్సి,విజయ్ మాల్యా లాంటి వాళ్ళు వేల కోట్ల రూపాయల బ్యాంకు ధనం కొల్లగొట్టి దేశం నుంచి పరారు అయిన ప్రక్రియలో మోడీ హస్తం ఉందని అన్నారు..విజయ్ మాల్యా తప్ప మిగతా వారందరూ గుజరాతీయులే అన్నారు..ఒక సభలో దొంగల పేర్లన్నీ మోడి లే అన్న నెపం తో రాహుల్ గాంధీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయడం అసలు విషయం కాదని, దేశం కోసం దేశ ప్రజల కోసం అహర్నిశలు కష్టపడుతున్న నెహ్రూ  వారసుల అడ్డు తొలగించుకుంటే బీజేపీకి ఎదురుండదు అనే దురుద్దేశం ప్రజలకు అందరికీ అర్థం అవుతోందని అన్నారు..రాహుల్ గాంధీ దేశం కోసం పోరాడుతున్నడని, దేశం ఇప్పుడు రాహుల్ గాంధీ కోసం ప్రజాస్వామ్యం కోసం పోరాడాలని ప్రజలకు పిలుపునిచ్చారు.. ప్రజా స్వామ్యం ప్రమాదంలో ఉందని అనడానికి కారణల్లో  రాహుల్ గాంధీ పై వేటు కూడా ఉందని అన్నారు...కాంగ్రెస్ నిరసన కార్యక్రమానికి సిపిఎం పార్టీ సుతారి రాములు,
 సిపిఐ పార్టీ నాయకులు చెన్న విశ్వనాథం గారు. సిపిఐ ఎంఎల్ డెమోక్రసీ పార్టీ చింత భూమేశ్వర్ లు సంఘీ భావం ప్రకటించారు..ఈ కార్యక్రమంలో కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్.  కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొంతం రాజాం. మెట్పల్లి మండల అధ్యక్షులు అంజిరెడ్డి. ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షులు శ్రీకాంత్ రెడ్డి. బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు సత్యనారాయణ. అల్లూరి మహేందర్ రెడ్డి. కోరుట్ల మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు గంగా నర్సయ్య. జగిత్యాల జిల్లా కిసాన్ సెల్ ప్రధాన కార్యదర్శి పోతుగంటి శంకర్. యువజన కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు ఏలేటి మహిపాల్ రెడ్డి. మల్లాపూర్ ఎంపిటిసి మల్లయ్య. మెట్పల్లి మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నిర్మల. మెట్పల్లి  మండల కిసాన్ సెల్ అధ్యక్షులు తిరుపతిరెడ్డి. గుండంపల్లి ఎంపిటిసి మంజుల లక్ష్మారెడ్డి. కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి తుపాకుల భజన్నా. జగిత్యాల జిల్లా సేవాదళ్ అధ్యక్షులు అందే మారుతి. ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు  కోటగిరి వెంకటస్వామి. కోరుట్ల పట్టణ జనరల్ సెక్రెటరీ మ్యాకల నర్సయ్య.కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి ఎంబేరి  సత్యనారాయణ. కోరుట్ల పట్టణ కిసాన్ సెల్ అధ్యక్షులు శ్రీరాములు అమరేందర్.కిసాన్ సెల్ జగిత్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి బి.క్రాంతి. కోరుట్ల మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు పన్నాల అంజిరెడ్డి. మెట్పల్లి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు జెట్టి లక్ష్మణ్. మల్లాపూర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు పోతు శేఖర్. మెట్పల్లి మండల కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు ఇల్లేందుల రాజు. మెట్పల్లి పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి. రాంప్రసాద్. కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు ఆఫీజ్.ఇబ్రహీంపట్నం మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు దూదిగామ గంగాధర్.వేంపేట ఉపసర్పంచ్ ప్రవీణ్. విటల్ రవీందర్ రెడ్డి. సోషల్ మీడియా కోఆర్డినేటర్ ముహమ్మద్ నసీర్,ధర్మారం మాజీ ఉపసర్పంచ్ రంజిత్ రెడ్డి. జనార్ధన్. వెంకటేష్.సహదేవ్. బొల్లె నర్సయ్య. కోరుట్ల మండలం మహిళా అధ్యక్షురాలు లావణ్య. రసూల్. యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి సరికేలా నరేష్. చిట్టిబాబు. మాజీ ఎంపీటీసి నర్సయ్య. బెజ్జారాపు శ్రీనివాస్. శంకర్.పుల్లారెడ్డి.వెంక గౌడ్ముంజరాజం  దువాక అరుణ్ తదితరులు పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow