ఎస్సీ కళాశాల వసతి గృహ అధికారులపై కలెక్టర్ కు ఫిర్యాదు
జగిత్యాల జిల్లా కేంద్రంలోని గంజ్ రోడ్డులో గల ఎస్సీ కళాశాల బాలికల వసతి గృహం - అధికారులపై స హా రక్షణ వేదిక జగిత్యాల జిల్లా శాఖ తరపున జిల్లా కలెక్టర్ కు శుక్రవారం ఫిర్యాదు చేసినట్టు స హా రక్షణ వేదిక జిల్లా ప్రధాన కార్యదర్శి చంద్ర శేఖర్ ఒక ప్రకటనలో తెలిపారు. వసతి గృహంలో గత సంవత్సరం అక్టోబర్ లో దసరా సెలవుల్లో డే అండ్ నైట్ వాచ్ మెన్ లు లేకున్నా వారు విధుల్లో ఉన్నట్టు ధృవ పత్రాలు జారీ చేసి వారికి పూర్తి జీతాలు చెల్లించారని తెలిపారు. ఈ విషయం ఆర్టీఐ ద్వారా అధికారులు స్వయంగా వెల్లడించారని, కావున కాంట్రాక్టర్లతో కుమ్ముక్కవడమే కాకుండా ప్రభుత్వ ధనం దుర్వినియోగం చేసిన వారిపై విచారణ జరిపి తగు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో కలెక్టర్ ను కోరినట్టు వివరించారు.
What's Your Reaction?