ఎమ్మెల్యే కొడుకుపై జగిత్యాల కలెక్టర్ కు ఫిర్యాదు

జగిత్యాల, డిసెంబర్ 22: కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు కుమారుడు అధికార కార్యక్రమాల్లో ఎమ్మెల్యే తరహాలో చెక్కులు పంపిణీ చేస్తున్నాడని ఇది రాజ్యాంగ విరుద్దామంటూ వైఎస్ఆర్ టిపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చెదల సత్యనారాయణ కలెక్టర్ కు ఇచ్చిన వినతిపత్రం లో కోరారు. గురువారం కోరుట్ల నియోజకవర్గ పరిధిలో కళ్యాణలక్ష్మి, షాధిముభారక్ చెక్కులను ఎమ్మెల్యే కొడుకు సంజయ్ రావు ప్రజలకు పంపిణీ చేసి రాజ్యాంగ విరుద్ధ వ్యవహారాలకు శ్రీకారం చుట్టడని ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రజల ఓట్లతో గెలుపొందిన ప్రజాప్రతినిధులను అవమానించినట్లని చట్ట విరుద్ధముగా ప్రభుత్వ చెక్కులను ప్రైవేటు వ్యక్తి ఎలా పంపిణీ చేస్తాడని ఈ విషయంపై చర్యలు తీసుకోవాలని వైఎస్ఆర్ టిపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చెదల సత్యనారాయణ కలెక్టర్ కు ఇచ్చిన ఫిర్యాదులో కోరారు. ఆయన వైఎస్ఆర్ టిపి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చెదల సత్యనారాయణ కలెక్టర్ ను కోరారు. ఆయన వెంట నాయకులు కాముని గంగాధర్ ఉన్నారు.
What's Your Reaction?






