ఆర్టీసీ మరియు రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ

Feb 11, 2023 - 01:22
Feb 11, 2023 - 01:23
 0  486
ఆర్టీసీ మరియు రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ

జగిత్యాల జిల్లా కోరుట్ల ఆర్టీసీ మరియు రవాణా శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఆర్టీసీ ఆదాయానికి గండి కొట్టే అక్రమ ప్రైవేట్ వాహనాలు(ఆటో,జీపు, టాటాఏసీ,) తనిఖీనీ  కోరుట్ల - మెట్ పల్లి రూట్ లో నిర్వహించి సరియైన పత్రాలు మరియు ఫిట్నెస్ లేని మరియు పరిమితికి మించి ప్రయాణికులను తీసుకు వెళ్ళుచున్న వాహనాలను సుమారుగా 35 వాహనాలను చెక్ చేయగా అందులో 14 వాహనాలను సీజ్ చేయడం జరిగింది. అలాగే సుమారుగా 1లక్షల 35వేల వరకు జరిమానాలు విధించడం  జరిగింది. అలాగే MVI రంజిత్ కుమార్ మాట్లాడుతూ..ఫిట్నెస్ మరియు ఇన్సూరెన్స్ లేని వాహనాలలో ప్రయాణికులు ప్రయాణించినప్పుడు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ప్రమాద బీమా వర్తించదు. కావున ప్రతి ఒక్కరూ ఆర్టీసీ బస్సులలోనే సురక్షితంగా ప్రయాణం చేసి వారి యొక్క గమ్యాన్ని చేరుకోవాలని తెలిపారు. అలాగే ఇప్పటినుండి మార్చి వరకు స్పెషల్ డ్రైవ్ ఇలాగే కొనసాగుతుంది. కావున ప్రతి ఒక్క ప్రైవేట్ వెహికల్ కి ఫిట్నెస్ మరియు ఇన్సూరెన్స్ మరియు వాటికి సంబంధించిన పత్రాలు అన్ని సమకూర్చుకోవాలని లేనిచో అధిక మొత్తంలో జరిమానాలు విధించబడునని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ రంజిత్ కుమార్ , డిపో మేనేజర్ లక్ష్మీ ప్రసూన , సెక్యూరిటీ హెడ్ కానిస్టేబుల్ మహేందర్ రెడ్డి , బస్టాండ్ కంట్రోలర్ ఎన్.కె రావు,కార్గో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ రమేష్ ,తిరుమల రావు,లక్ష్మణ్,గోపాల్,శ్రావణ్  పాల్గొన్నారు

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow