అధికారులకు, సిబ్బందికి ప్రశంస పత్రాలు (KPI రివార్డ్స్)
ఫంక్షనల్ వర్టీకల్స్ అమలుపై నిరంతర పర్యవేక్షణ: జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్పో, లీస్ శాఖ అమలు చేస్తున్న వర్టీకల్స్ సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని ఆదేశం, ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధి నిర్వహణలో ప్రతిభ కనబర్చిన 52 మంది ఏ అధికారులకు, సిబ్బందికి ప్రశంస పత్రాలు (KPI రివార్డ్స్).
జగిత్యాల : పోలీస్ శాఖలో అమలు చేస్తున్న వర్టీకల్స్ విషయంలో ప్రతి పోలీస్ అధికారి శ్రద్ద వహించి సమర్ధవంతంగా అమలయ్యేలా చూడాలని జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ సూచించారు. ఈరోజు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో పోలీస్ శాఖ అమలు చేస్తున్న వివిధ రకాల వర్టికల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అధికారులకు, సిబ్బందికి ప్రశంస పత్రాలు రివార్లు అందజేయడం జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పి మాట్లాడుతూ... ఫంక్షనల్ వర్టికల్ ద్వారా పోలీస్ అధికారులకు సిబ్బందికి పని భారం తగ్గుతుంది, టెక్నాలజీ ద్వారా మరింత మెరుగైన సేవలు అందించవచ్చని. పని విభజన, రోల్ క్లారిటీ ద్వారా ప్రతి ఒక్కరికీ బాధ్యత పెరుగుతుందని తెలిపారు. ఫంక్షనల్ వర్టికల్ వారీగా విధినిర్వహణలో ప్రతిభ కనబరిచిన పోలీస్ అధికారులు సిబ్బందిని అభినందించారు. మరియు ప్రతిభ కనబరిచే సిబ్బందిని అధికారులను గుర్తించి ప్రతి నెల (KPI REWARDs) అధికారులను సిబ్బందిని ప్రోత్సహించే విధంగా రివార్డులు, అవార్డులు, ఇవ్వడం జరుగుతుందన్నారు. ప్రతి ఒక్కరూ ప్రజల కోసం అంకితభావంతో విధులు నిర్వహించి ప్రజలకు ఎల్లవేళలా సేవలు అందించడానికి అందుబాటులో ఉండాలని సూచించారు, మరియు ప్రతి ఒక్కరూ ఫంక్షనల్ వర్టికల్ వారిగా పోటీపడి విధులు నిర్వహించి రివార్డులు, అవార్డులు పొందాలని సూచించారు. కష్టపడి అంకితభావంతో విధులు నిర్వహించే వారికి డిపార్ట్మెంట్లో కచ్చితంగా గుర్తింపు ఉంటుందని తెలిపారు.ఆన్లైన్ డాటా నమోదు పరిచిన విధంగా సిసిటిఎన్ఎస్ & టిఎస్ కాప్ ఆధారంగా వారి యొక్క పనితనాన్ని బట్టి రివార్డ్స్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ప్రజలకు మరింత వేగవంతమైన, నాణ్యమైన సేవలు అందించేల ప్రతి ఒక్క అదికరి కృషి చేయాలని సూచించారు .
కెపిఐ రివార్డ్స్ అందుకున్న వారి వివరాలు. స్టేషన్ హౌస్ ఆఫీసర్ (03), ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ (03), రిసెప్షన్ (03), బ్లూ కోల్ట్స్(06), సెక్షన్ ఇంచార్జ్ (03), స్టేషన్ రైటర్స్ (03), సిడిఓ కోర్టు (03), టెక్ టీమ్ (03), ట్రాఫిక్ వర్టికల్ (03 ), 5s (03), సెక్షన్ ఇంచార్జ్ (03),రియలైజేషన్ (03), సమన్స్ & వారెంట్స్ (06 ), డిసిఆర్బి (03 ), ఐటి కోర్ (04 ), మొత్తం (52 ) మంది. పోలీస్ అధికారులకు సిబ్బందికి ప్రశంస పత్రాలు (KPI రివార్డ్స్) అందజేయడం జరిగింది.
ఈ కార్యక్రమంలో SB,DCRB, ఐటీ కోర్ ఇన్స్పెక్టర్ లు రాజశేఖర్ రాజు, శ్రీనివాస్, సరిలాల్ మరియు ఎస్సైలు, ఏ ఎస్సైలు, సిబ్బంది, DCRB, ఐటీ కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
What's Your Reaction?