అంబేద్కర్ పై అనుచిత వాఖ్యలు చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

భారత రాజ్యాంగ నిర్మత బాబా సాహెబ్ అంబేద్కర్ గారి పై అనుచిత వాక్యాలు చేస్తూ ఓ సోషల్ మీడియాలో ఒక వీడియో ను వైరల్ చేయడం జరిగింది. దీనిని కండిస్తూ తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలో భారత రాజ్యాంగ నిర్మాతపై అనుచిత వ్యాఖ్యలు చేసిన హమారా ప్రసాద్ అనే వ్యక్తిని చట్ట ప్రకారం కఠినంగా శిక్షించాలి అని ఇస్తానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు
బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగ నిర్మాత, భారతదేశానికి దశాదిశా చూపినటువంటి ఆధునిక భారతదేశ పితామహుడు అయినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని చంపుతానని మాట్లాడడం ఇది సమాజంలో రేపటి రోజు అలజడులకు కారణం అవుతుంది. మరియు అంబేద్కర్ వాదుల మనోభావాలను దెబ్బతీసే విదంగా మాట్లాడటం జరిగింది కాబట్టి ఇలాంటి వాళ్లను కఠినంగా శిక్షించాలని తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండల అధ్యక్షుడు బంగారు దీపక్ డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బంగారు దీపక్ మ్యాదరి రాజశేఖర్ దాసరి మధుసూదన్ మణుగూరు వినోద్ చిట్యాల ప్రశాంత్ రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
What's Your Reaction?






