అందాజ గత 20 రోజుల క్రిందట కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన మరియు రాయికల్ కి చెందిన కొంతమంది వ్యక్తులను హత్య చేయుటకు కోరుట్ల మండలానికి చెందిన ఐదు గురు వ్యక్తులు పన్నిన కుట్ర కేసుకు సంబంధించిన వివరాలు కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు వెల్లడించినారు

Dec 15, 2022 - 04:20
Dec 24, 2022 - 04:14
 0  918
అందాజ గత 20 రోజుల క్రిందట కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామానికి చెందిన మరియు రాయికల్ కి చెందిన కొంతమంది వ్యక్తులను హత్య చేయుటకు కోరుట్ల మండలానికి చెందిన ఐదు గురు వ్యక్తులు పన్నిన కుట్ర కేసుకు సంబంధించిన వివరాలు కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు వెల్లడించినారు

కోరుట్ల మండలం పైడిమడుగు గ్రామంలో ఆర్.ఎం.పి వృత్తి నిర్వహిస్తున్న ధనకంటి సంపత్ (35) అనే వ్యక్తికి అతని బావమరిది అయిన రాయికల్ లో వ్యాపారం నిర్వహిస్తున్న జగిత్యాల-కన్నాపూర్ గ్రామానికి చెందిన సంకోజి విష్ణువర్ధన్ కు మధ్య కొన్ని ఆర్థిక లావాదేవీలు కలవు. అదేవిధంగా నిందితుడు సంపత్, విష్ణువర్ధన్ యొక్క కుటుంబ విషయాల్లో సైతం తల దూర్చుతూ ఉండేవాడు. ఈ క్రమంలో నిందితుడు సంపత్, విష్ణువర్ధనును అడ్డు తొలగిస్తే అతని ఆస్తి మరియు అతని కుటుంబం పై పట్టు సాధించవచ్చని దురాలోచన కలిగి విష్ణువర్ధన్ తర్వాత విష్ణువర్ధన్ బావమరిది అయినా అజయ్ తనకు అడ్డుగా నిలుస్తాడని భావించి విష్ణువర్ధన్ తో పాటు అజయ్ ని సైతం అడ్డు తొలగించాలని నిర్ణయించుకున్నాడు. 

ఈ క్రమంలో గతంలో సంపత్, విష్ణువర్ధన్ కి కొన్ని ఇంజక్షన్స్ ఓవర్డోస్ ఇచ్చినాడు అని మరియు విష్ణువర్ధన్ కుటుంబ సభ్యులతో సైతం అసభ్యకరంగా ప్రవర్తించినాడని విష్ణువర్ధన్ అనుమానించినాడు. ఈ క్రమంలో విష్ణువర్ధన్ తన చిట్టి డబ్బులు సంపత్ దగ్గర ఉండటం వలన సంపత్ వద్దకు పైడిమడుగు గ్రామనికి వచ్చి వెళ్లే క్రమంలో అతన్ని ఎవరో వెంబడిస్తున్నట్లు అనుమానించి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు ఈ క్రింది విషయాలను వెలుగులోకి తీసుకొని వచ్చినారు. 

నిందితుడు సంపత్ తన బావమరిది విష్ణువర్ధన్ తో గల ఆర్థిక లావాదేవీలు కుటుంబ విషయాలు మనసులో పెట్టుకొని విష్ణువర్ధన్ తో పాటు అజయ్ ను మరియు పైడిమడుగు గ్రామానికి చెందిన తన డాక్టర్ వృత్తికి అడ్డుగా నిలుస్తున్నాడని భావించిన వేరొక ఆర్.ఎం.పి డాక్టర్ రాజేందర్ ను హత్య చేయించి అడ్డు తొలగించుటకు నిర్ణయించుకొని ఇట్టి విషయం తన స్నేహితుడు అయిన మరొక నిందితుడు పైడిమడుగు గ్రామానికి చెందిన శేఖర్ తో చర్చించి గత నెల ఇరువురు కలిసి గతంలో ఒక అత్యాయత్నం కేసులో నిందితుడు అయినా ఆకుల అశోక్ వద్దకు వచ్చి పై ముగ్గురిని చంపడానికి బేరం మాట్లాడగా సదరు అశోక్ తన స్నేహితుడు అయినా కోరుట్ల పట్టణానికి చెందిన విత్తనాల నాగరాజును పిలిపించుకొని అశోక్, నాగరాజు ,సంపత్, శేఖర్లతో పై ముగ్గురిని అనగా విష్ణువర్ధన్, అజయ్ మరియు రాజేందర్ లను హత్య చేయుటకు రూపాయలు 14,00,000/- రూపాయలు సుపారి మాట్లాడుకోవడం జరిగినది. అందుకు సంపత్ మొదటగా ఆర్ఎంపీ రాజేందర్ ను హత్య చేయుటకు నాలుగు లక్షలు ఆ తర్వాత మరో ఇద్దరినీ హత్య చేయుటకు ఒప్పందము కుదుర్చుకొని మొదటగా 1 లక్ష రూపాయలు అడ్వాన్స్ ఇచ్చుటకు ఒప్పుకోనైనది. సంపత్ తన ఒప్పుకున్న డబ్బు ఇచ్చుటలో జాప్యం జరిగినది. ఈ క్రమంలో తేదీ : 05 -12-2022 రోజున రాత్రి సమయంలో నిందితుడు అశోక్ పైడిమడుగు గ్రామానికి చెందిన గతంలో ఒక హత్య కేసులో నిందితుడు అయినా మేదిని శ్రీకాంత్ ను సంప్రదించి అశోక్ మరియు శ్రీకాంతులు రాజేందర్ ఇంటి వద్దకు వెళ్లి రాజేందర్ ను పిలిచే క్రమంలో కొంతమంది గ్రామస్తులు అటుగా రాగా అక్కడి నుంచి వెళ్ళిపోయినారు. పోలీసులు విచారణ అనంతరం ఇట్టి కేసులో ఈ క్రింది నిందితులను అదుపులోకి తీసుకొని ఈరోజు కోర్టులో హాజరు పర్చనైనది.

1) దనకoటి సంపత్ చారి s/o నారాయణ, 35years , వడ్రంగి ,R/o పైడిమడుగు, కోరుట్ల     

2) క్యాతం శేఖర్ s/o భూమానంధo , 38 years , పద్మశాలి ,R/o పైడిమడుగు, కోరుట్ల  

3) ఆకుల అశోక్ s/o సాయిలు , 29 years , గంగపుత్ర ,R/o ఎస్కొనిగుట్ట , కోరుట్ల  

4) విత్తనాల నాగరాజు s/o పోతరాజు , 40 years , గౌడ్ ,R/o ఇందిరా రోడ్డు , కోరుట్ల  

5) మేదిని శ్రీకాంత్ s/o బాబయ్య , 28 years , మాల R/o పైడిమడుగు, కోరుట్ల  

మరియు పోలీసు వారు పై నిధుల వద్ద నుండి నేరక్రమంలో ఉపయోగించిన 4 సెల్ ఫోన్లు, 2 కార్లు మరియు 1 మోటార్ సైకిల్ చేసుకున్నారు. ఇట్టి కేసును చేదించి నిందితులను స్వల్పకాలంలో అరెస్టు చేసి ముగ్గురు వ్యక్తులకు ప్రాణహాని కలగకుండా చట్టరీత్యా చర్యలు తీసుకున్న కోరుట్ల సీఐ రాజశేఖర్ రాజు, ఎస్సైలు సతీష్, శ్యామ్ రాజ్ , మేడిపల్లి ఎస్ఐ సుదీర్ రావు, కథలాపూర్ ఎస్సై రామచందర్ గౌడ్ మరియు సిబ్బంది హలీం, విజయ్, సత్తయ్య ఎల్లయ్య, శ్రీధర్,సాగర్ లను మెట్పల్లి డిఎస్పి రవీంద్రారెడ్డి మరియు జగిత్యాల జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందించినారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow