మైనార్టీ జూనియర్ కాలేజీని ప్రారంభించిన కోరుట్ల ఎమ్మెల్యే
బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పేద పిల్లల ఉన్నత విద్య చదువుల కోసం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటుచేసిన తెలంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్ ను ఈరోజు కోరుట్ల ఎమ్మెల్యే గౌరవ శ్రీ కల్వకుంట్ల విద్యాసాగర్ ప్రారంభించడం జరిగింది
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం ఒక్కో విద్యార్థికి పౌష్టిక ఆహారం మరియు యూనిఫామ్ బుక్స్ వంటి తదితర ఖర్చు కోసం సంవత్సరానికి ఒక్కరికి ఒక లక్ష 30 వేల రూపాయల చొప్పున ఖర్చు చేస్తుందని విద్యార్థులందరూ ఈ అవకాశం సద్వినియోగం చేసుకుని ఉన్నతంగా ఎదగాలని దేశంలోనే తెలంగాణకు, మరియు తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకురావాలి తెలియజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ అన్నం లావణ్య అనిల్ , పట్టణ అధ్యక్షులు అన్నం అనిల్ , మండల అధ్యక్షులు దారిశెట్టి రాజేష్ , మరియు కౌన్సిలర్లు సజ్జు. సబీర్. రఫి నాజీబ్ నాయకులు, కాలేజీ ప్రిన్సిపల్ షాహీద్ అలీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
What's Your Reaction?