మైనారిటీలకు 12% రిజర్వేషన్ కల్పించాలి - కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణా రావు

జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో విలేఖరుల సమావేశంలో కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు జువ్వాడి కృష్ణా రావు మాట్లాడుతూ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన మైనారిటీ లోన్లను ప్రకటించిన విషయం తెలిసిందే...కానీ ప్రభుత్వం మంజూరు చేసినా యూనిట్లకు మరియు పేదరికంలో, నిరుద్యోగంతో అల్లాడుతూ ఎదైనా వ్యాపారం చేద్దాం అనుకుంటున్న ఆశావహుల సంఖ్యకు,మైనారిటీ లోన్ల కోసం అప్లికేషన్లు వచ్చిన సంఖ్యకు తారాస్థాయిలో వత్యాసం ఉన్నది.. జగిత్యాల జిల్లాకు 84 యూనిట్లు మంజూరు చేయడం అనేది చాలా బాధాకరం అని,దీని వల్ల చాలా మంది మైనారిటీలు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు కావున యుద్ధప్రాతిపదికన లోన్ జగిత్యాల జిల్లాలో యూనిట్ల సంఖ్యను మూడువేల యూనిట్ల వరకు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు... సీఎం కేసీఆర్ మేనిఫెస్టో లో పెట్టిన విధంగా మైనారిటీలకు ఉపాధి,ఉద్యోగ అవకాశాల్లో 12% రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ,కేసీఆర్ రాజకీయ లబ్ది కోసం ముందస్తు ఎన్నికల కోసం కేంద్ర ప్రభుత్వంతో లోపాయికారీ ఒప్పందం చేసుకుని పర్మిషన్ తెచ్చుకుని బీజేపీ ఆశీస్సులతో ముందస్తు ఎన్నికలకు పోవడం తద్వారా రెండో సారి అధికారంలోకి వచ్చిన విషయం తెలిసిందే...అదే విధంగా సీఎం కేసీఆర్ కు మరియు తెరాసలో ఉన్న మైనారిటీ ప్రజాప్రతినిదులకు మైనారిటీ రిజర్వేషన్ ,మైనారిటీ వర్గాల ఉన్నతి కోసం కృషి చేసే చిత్తశుద్ధి ఏ మాత్రం ఉన్న తక్షణమే రిజర్వేషన్ కల్పించేలా ఆమోదయోగ్యమైన రీతిలో చర్యలు ముమ్మరం చేయాలని డిమాండ్ చేయడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు తిరుమల గంగాధర్ పట్టణ ఉపాధ్యక్షులు ఎం ఏ నయిం పట్టణ మాజీ కౌన్సిలర్ హమీద్ వసీం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రిజ్వాన్ పట్టణకార్యదర్శి మ్యాకల నర్సయ్య సహాయ కార్యదర్శి ఎంబేరి సత్యనారాయణ సలీం బారి రిహాన్ వాజిద్ తదితరులు పాల్గొన్నారు
What's Your Reaction?






