పెండింగ్ కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి : డిజిపి మహేందర్ రెడ్డి. ఆదేశాలు

Dec 28, 2022 - 03:01
Jan 10, 2023 - 23:51
 0  1.4k
పెండింగ్ కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి : డిజిపి మహేందర్ రెడ్డి. ఆదేశాలు

జగిత్యాల జిల్లా...

పెండింగ్ కేసుల పరిష్కారంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలి : డిజిపి మహేందర్ రెడ్డి అదేశాలు 

- - నేడు- పోలీస్ కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో నేర, ఫంక్షనల్ వర్టికల్, HRMS, సైబర్ క్రైమ్ ల సమీక్ష నిర్వహించిన డిజిపి .

రాష్ట్ర డిజిపి ఎం. మహేందర్ రెడ్డి తెలంగాణ జిల్లాల ఎస్పీలతో, పోలీస్ కమిషనర్ల తో పెండింగ్ లో ఉన్న కేసుల గురించి, ఫంక్షనల్ వర్టికల్, HRMS, సైబర్ క్రైమ్ ల గురించి డిజిపి ఆఫీస్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.... పెండింగ్ కేసులు, క్రైమ్ ఎగినెస్ట్ ఉమెన్ , ఎస్సీ ఎస్టీ ,గ్రెవ్ కేసులపై పోలీస్ అధికారులు తీసుకొన్న ప్రత్యేక చోరవతో పెండింగ్ కేసుల్లో పురోగతి సాధించారని అన్నారు. కొత్త కేసులతో పాటు దీర్ఘకాలంగా పెండింగ్ కేసులను సమీక్షించడం ద్వారా కేసుల సంఖ్య తగ్గించే దిశగా అన్ని స్థాయిల అధికారుల పని చేయాలన్నారు. కోర్టు కేసులలో నిందితులకు శిక్షలు పడే విధంగా ట్రయల్ సమయంలో పోలీసు అధికారులు సంబంధిత కోర్టులకు వెళ్లి గ్రేవ్, నాన్ గ్రేవ్ మరియు మహిళలకి సంబంధించిన కేసులలో సాక్ష్యలను మోటివేట్ చేయాలని సూచించారు. కోర్టు స్టే ఉన్న కేసుల్లో జిల్లా అధికారులు ప్రత్యేక చొరవ తీసుకుని సంబంధిత కోర్ట్ లకు హాజరై కేసును త్వరగా పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రతి కేసులో క్వాలిటీ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఉండాలని ప్రతి కేసుకు సంబంధించి ప్లాన్ అఫ్ యాక్షన్ రాయాలని దీనికి సంబంధించి డీఎస్పీ లు ,యూనిట్ ఆఫీసర్ లు మానిటర్ చేయాలని సూచించారు.పోక్సో యాక్ట్ కేసుల్లో విచారణ వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. నేరస్తులకు శిక్షల శాతం పెంచే విధంగా అధికారుల చర్యలు ఉండాలని ప్రతి గ్రేవ్ కేసులలో ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి కోర్టు లో ట్రయల్ నడిచే సమయంలో సాక్షులను బ్రీఫ్ చేయాలని సూచించారు. పోలీస్ అధికారుల మరియు సిబ్బంది యొక్క సర్వీస్ పర్టికులర్ ఆన్లైన్ ప్రక్రియ గురించి (HRMS) హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ సిస్టం ను పకడ్బందిగా అమలు చేయలని సూచించారు. ఫంక్షనల్ వర్టికల్ వారిగా జిల్లా స్థాయిలో ప్రతిరోజూ మానిటర్ చేయాలని సూచించారు. ఫంక్షనల్ వర్టీకల్ లో ప్రతిభ కనబరిచిన అధికారులకు ఎక్కువ కేసులల్లో కన్విక్షన్ సాధించిన వారికి సేవ పథకం ,ఎక్కువ కేసుల్లో లైఫ్ కన్విక్షన్ సాధించి వారికి ఉత్తమ సేవ పథకం ఇవ్వడం జరుగుతుంది అని తెలిపారు.ఎస్.హెచ్.ఓ.లు, రిసెప్షన్, బ్లూ కోట్స్, పెట్రో కార్స్, స్టేషన్ రైటర్లు, క్రైమ్ రైటర్లు, క్రైం సిబ్బంది, కోర్టు డ్యూటీ ఆఫీసర్స్, వారెంట్, సమన్స్ సిబ్బంది, టెక్ టీమ్, 5 ఎస్, మెడికల్ సర్టిఫికెట్స్, ఎఫ్.ఎస్.ఎల్., సెక్షన్ ఇంచార్జ్, ఐఓలు, జనరల్ డ్యూటీ సిబ్బందికి సంబందించిన వర్టీకల్స్ పై డీజీపీ సమగ్రంగా సమీక్ష నిర్వహించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో డీఎస్పీ లు ప్రకాష్, A.O అమర్నాథ్, SB ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, DCRB ఇన్స్పెక్టర్ మల్లయ్య, ఇన్స్పెక్టర్ లు కిషోర్ ,RI లు వామనమూర్తి, నవీన్, DCRB సిబ్బంది పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow