జగిత్యాల జిల్లాలో పోగొట్టుకున్న, చోరి కీ గురైన 29 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు
సెల్ ఫోన్ పోతే ఆందోళన వద్దు: జిల్లా ఎస్పీ ఎగ్గడి భాస్కర్ .
సెల్ ఫోన్ పోయిన, చోరీకి గురైన ఆందోళన చెందవద్దని CEIR ద్వారా తిరిగి పొందవచ్చని జిల్లా ఎస్పీ అన్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో పోగొట్టుకున్న, చోరి గురైన 29 సెల్ ఫోన్ లను స్వాధీనం చేసుకొని బాధితులకు అప్పగించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ... పోయిన లేదా చోరీకి గురైన మొబైల్ ఫోన్లను త్వరితగతిన పట్టుకోవడానికి CEIR వెబ్సైట్ ఎంతో ఉపయోగపడుతుందని జిల్లా ఎస్పీ భాస్కర్ తెలిపారు. CEIR వెబ్సైట్లో వినియోగదారులు వివరాలను నమోదు చేసుకుంటే మొబైల్స్ ని ఈ పోర్టల్ ద్వారా సులభంగా స్వాధీనం చేసుకునే ఆస్కారం ఉంటుందని తెలిపారు. జిల్లావ్యాప్తంగా సుమారు 2.5 లక్షల విలువ గల 29 మొబైల్ ఫోన్స్ ఈ పోర్టల్ ద్వారా రికవరీ చేసి ఆదివారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బాధితులకు అందజేశారు. CEIR పోర్టల్ నిర్వహణకు పోలీస్ స్టేషన్లో నోడల్ అధికారుల ను ఏర్పాటుచేసి శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. CEIR ఆవశ్యకతను తెలుపుతూ ప్రజలకు అవగాహన కల్పించామన్నారు. మొబైల్ నెంబర్ ,మీ సేవ రసీదు, IMEI మొదలగు వివరాలతో ఈ పోర్టల్ నందు నమోదు చేసుకోవాలన్నారు. ఇలా నమోదు చేయడం IMEI ద్వారా ఫోన్ బ్లాక్ చేయబడి పనిచేయదు అన్నారు. ఇందులో ఎవరైనా సిమ్ కార్డ్ వేసుకుంటే ట్రేస్ రిపోర్టు వస్తుందని దీని ఆధారంగా పోయిన మొబైల్ లొకేషన్ గుర్తించి స్వాధీనం చేసుకోవచ్చన్నారు. ఫోన్ లభించిన తర్వాత అదే వెబ్సైట్లో కి వెళ్ళి అన్ బ్లాక్ చేయాలని పేర్కొన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే ఫోన్లలో ఉన్న వ్యక్తిగత ఆధారం గురించి నష్టాన్ని కాజేస్తుందన్నారు. ఇది వ్యక్తిగత సామాజిక భద్రతకు భంగం కలుగుతుందన్నారు. దొంగిలించిన ఫోన్లను నేరాలకు పాల్పడే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరూ CEIR వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలన్నారు. అదే విదంగా ఎవరైనా సెకండ్ హాండ్ ఫోన్ లు కొనే ముందు అప్లికేషన్లో అట్టి ఫోన్ యొక్క వివరాలను అనగా IMEI నంబర్లు నమోదు చేసి చెక్ చేసుకోవాలని తద్వారా అట్టి ఫోన్ ఆ ఫోన్ యొక్క స్టేటస్ తెలుస్తుంది అన్నారు. అదేవిధంగా ఎవరికైనా సెల్ఫోన్లు దొరికితే సంబంధిత పోలీస్ స్టేషన్లో గాని లేదా ఆ నెంబర్ వారికి ఫోన్ చేసి వారికి అప్పగించాల్సిందిగా సూచించారు. ఈ సందర్భంగా సాంకేతిక ఉపయోగించి మొబైల్ ఫోన్లో రికవరీ చేయడంలో ప్రతిభ కనబరిచిన ఐటి కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్,RSI దినేష్ మరియు వివిధ పోలీస్ స్టేషన్ ల ఎస్.ఐ లను ఐటి కోర్ సిబ్బంది జిల్లా ఎస్పీ అభినందించారు.
1. మామిడి హరీష్ అనే వ్యక్తి కోరుట్ల పట్టణంలో ఇతను 25,000 వేల విలువగల తన మొబైల్ ను గత నెల లో పోవడం జరిగింది. వెంటనే సదరు వ్యక్తి పోలీస్ స్టేషన్ లో కేసు ఫిర్యాదు చేయగా CEIR ని ఉపయోగించి అయొక్క మొబైల్ బైంసా లో ఉన్నదని గుర్తించిన పోలీసులు ఫోన్ ని స్వాధీనం చేసుకుని సదరు వ్యక్తి ఇవ్వడం జరిగింది.
2. దండవెని గంగ మల్లయ్య అనే వ్యక్తి తన 72,0000 వేల విలువగల మొబైల్ అరుణాచల్ ప్రదేశ్ నుండి మంచిర్యాల వస్తుండగా పోవడం జరిగింది ఇతను మంచిర్యాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. CEIR గుర్తించి అతని అందించడం జరిగింది.
3. కోరుట్ల పట్టణానికి చెందిన రాధా అనే మహిళ తన యొక్క కూతురు గిఫ్ట్ గా ఇచ్చిన 28,000 వేల విలువగల సెల్ ఫోన్ గత మార్చి నెలలో డ్రైవింగ్ చేస్తుండగా ఎక్కడో కింద పడిపోవడం జరిగింది వెంటనే వివరాలను CEIR నమోదు చేయగా పోలీసులు ఆ యొక్క ఫోను గుర్తించి ఈ రోజు ఎస్పీ గారు చేతుల మీదుగా అందించడం జరిగింది.
ఈ సందర్భంగా బాధితులు తమ యొక్క ఫోన్ పోయినా విధానాన్ని వారు ఫోన్ పోయినప్పుడు అవలంబించిన విధానాన్ని తెలియజేశారు.సాంకేతికతను ఉపయోగించి పోయిన సెల్ఫోన్లను తిరిగి కనిపెట్టి తమకు ఇచ్చినందుకు బాధితులు ఎస్పీ గారికి ఆనందంతో కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డిఎస్పి ప్రకాష్, ఐటి కోర్ ఇన్స్పెక్టర్ సరిలాల్, RSI దినేష్ మరియు ఎస్.ఐలు సతీష్ ,సందీప్ , ఐటి కోర్ సిబ్బంది పాల్గొన్నారు.
What's Your Reaction?