గల్ఫ్ జెఎసి భరోసా దీక్షకు సంఘీభావం తెలిపిన జువ్వాడి సోదరులు
గల్ఫ్ జెఎసి భరోసా దీక్షకు సంఘీభావం
(RNI) జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని పాత మున్సిపల్ కార్యాలయం వద్ద గల్ఫ్ జేఏసీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన గల్ఫ్ భరోసా దీక్ష శిబిరాన్ని సందర్శించి గల్ఫ్ బాధితులకు కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు .జువ్వాడి కృష్ణ రావు సంఘీభావం తెలిపి గల్ఫ్ బాధితులు ఎదుర్కొంటున్న సమస్యలను గల్ఫ్ లో మరణించినటువంటి కుటుంబాలకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రేషియా ప్రభుత్వం తక్షణమే ఇవ్వాలని అన్నారు. ఈ మోసపూరిత మాటలకు కాలం చెల్లిందని ప్రభుత్వానికి చురకలాంటించారు. రేపు జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికుల సమస్యలను పొందుపరిచే విధంగా మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడతామని రేపు రాబోవు కాంగ్రెస్ ప్రభుత్వంలో గల్ఫ్ లో మరణించిన ప్రతి ఒక్క కుటుంబానికి 5 లక్షల రూపాయలు అందే విధంగా ఆర్థిక భరోసా ఇస్తామని అదేవిధంగా గల్ఫ్ బాధితుల కొరకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు మరియు జువ్వాడి కృష్ణారావు అన్నారు. అనంతరం మధ్యాహ్న భోజన కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జువ్వాడి నర్సింగ్ రావు మాట్లాడుతూ మధ్యాహ్న భోజన కార్మికులకు గత సంవత్సరం జూలై నుండి 3000 రూపాయలు గౌరవ వేతనం ఇస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. కానీ ఇప్పటికి పట్నాల నెలలు కావస్తున్న వారికి గౌరవ వేతనం పెంచలేదని అన్నారు . మధ్యాహ్న భోజన కార్మికులకు ఒక్కొక్కరికి 28 రూపాయలు బాకీ పడ్డ రూపాయలను ప్రభుత్వం వెంటనే చెల్లించి అదే విధంగా పెరిగిన ధరలకు అనుగుణంగా మెస్ చార్జీలను కూడా పెంచి మధ్యాహ్న భోజన కార్మికులను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని కోరుట్ల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జువ్వాడి నర్సింగ్ రావు డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కార్మికుల పక్షాన ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.వీరితో పాటు కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తిరుమల గంగాధర్. కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజాం. కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు నయీమ్. కోరుట్ల పట్టణ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి మేకల నర్సయ్య. కాంగ్రెస్ పార్టీ పట్టణ సహాయ కార్యదర్శి సత్యనారాయణ. కాంగ్రెస్ పార్టీ నాయకులు జబ్బర్ తదితరులు పాల్గొన్నారు..
What's Your Reaction?






