అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై పిడి యాక్ట్ నమోదు చేయండి తెలంగాణ -రాష్ట్ర  డిజిపి ఆదేశాలు

Feb 5, 2023 - 18:45
Feb 5, 2023 - 18:45
 0  540
అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిపై పిడి యాక్ట్ నమోదు చేయండి తెలంగాణ -రాష్ట్ర  డిజిపి ఆదేశాలు

రాష్ట్ర  డిజిపి  అంజనీ కుమార్ .,  తెలంగాణ జిల్లాల ఎస్పీలతో, పోలీస్ కమిషనర్ల తో  గ్రేవ్ క్రైమ్  ఇన్వెస్టిగేషన్, PD ఆక్ట్ , గురించి డిజిపి ఆఫీస్ నుండి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ.... తరచూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతూ, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ప్రమాదం ఉన్న వ్యక్తులను గుర్తించి వారిపై పీడి యాక్ట్ నమోదు చేయాలని అన్నారు. పిడి ఆక్ట్ నియమాల ప్రకారం నిర్ణీత కాల వ్యవధిలో ఓకే తరహా నేరాలు లేదా శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వారిని గుర్తించాలని సూచించారు. రౌడీలు, గొలుసు దొంగలు, జూదం నిర్వాహకులు, నకిలీ విత్తన తయారీదారులు, సైబర్ నేరగాళ్లు, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడే వారిపై నమోదు చేయాలని అన్నారు. ఈ  పీడీ యాక్ట్ చట్టాన్ని నిందితులు హైకోర్టులో సవాలు చేసే అవకాశం ఉంటుందని దానికి అనుకూలంగా సరైన ఆధారాలతో పీడీ యాక్ట్ నమోదు చేయాలని సూచించారు.

 హైకోర్టు ప్రభుత్వ స్పెషల్ జిపి ముజీబ్ కుమార్ సదాశివాని  పీడి యాక్ట్ అమెండ్మెంట్ గరుడ గట్టిన నేరస్తులపై   పీడి యాక్ట్ ఏ సమయంలో ఎన్ని రోజులలో ఎన్ని నెలల్లో  నేర ప్రవృత్తిని బట్టి  నేరస్తులపై  ఏఏ కేసులలో పెట్టాలో తదితర అంశాల గురించి వివరించడం జరిగింది.. 

ఇతర దేశాల నుండి టూరిస్ట్ విజ పై మన దేశంలోకి వచ్చే వారిపై పటిష్ట నిఘా ఉంచాలని సూచించారు. ఇటువంటి వారిలో  కొందరు డ్రగ్స్, ఇతర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే అవకాశం ఉంటుంది కాబట్టి జిల్లా స్పెషల్ బ్రాంచ్ సిబ్బంది సంబంధిత అధికారులు వారిపై పటిష్ట నిఘా ఉంచాలని సూచించారు.

కొత్తగా జిల్లాలలో, కమిషనరేట్లలో లో బాధ్యతలు స్వీకరించిన ఎస్పీలు పోలీస్ కమిషనర్లు ఆ  ప్రాంతాలపై పూర్తి పట్టు సాధించి నేరాల నియంత్రణకు కృషి చేయాలని డిజిపి  సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా  ఎస్పీ   భాస్కర్  ,డీఎస్పీ లు, రామాంజనేయులు , ప్రకాష్, రవీంద్ర రెడ్డి, SB , DCRB, ఇన్స్పెక్టర్ లు  శ్రీనివాస్, మల్లయ్య, సి.ఐ లు,రాజశేకర్ రాజు  , కిషోర్, కొటేశ్వర్, రమణమూర్తి, సరిలాల్  ఐటీ కోర్, DCRB  సిబ్బంది పాల్గొన్నారు.

What's Your Reaction?

like

dislike

love

funny

angry

sad

wow